IND vs AUS: భారత్‌ - ఆసీస్‌ రెండో టీ20.. అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. 8 ఓవర్ల ఆట రెడీ!

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. విదర్భ మైదానం అవుట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. తొలుత...

Updated : 23 Sep 2022 21:12 IST

నాగ్‌పుర్‌: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఎట్టకేలకు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఆటను 8 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకొన్నారు. ఒక్కో జట్టు 8 ఓవర్లు మాత్రమే ఆడనుంది. 9.15 గంటలకు టాస్‌ వేస్తారు. 9.30 గంటలకు తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభమవుతుందని అంపైర్లు పేర్కొన్నారు. తొలి 2 ఓవర్లు పవర్‌ ప్లే కాగా.. బౌలర్‌ అత్యధికంగా రెండు ఓవర్లను మాత్రమే వేస్తాడు. 

నిన్న రాత్రి వర్షం కారణంగా విదర్భ మైదానం అవుట్‌ ఫీల్డ్‌  చిత్తడిగా మారిపోయింది. తాజాగా 8.45 గంటలకు చేసిన పరిశీలనలో అంపైర్లు సంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్‌ నిర్వహణకు మార్గం సుగమమైంది. సాయంత్రం 6.30 గంటలకే టాస్‌ వేయాల్సి ఉండగా... అవుట్‌ ఫీల్డ్‌ సరిగా లేకపోవడంతో ఆలస్యమైంది. ఇప్పటికే 7 గంటలకు పరిస్థితిని అంపైర్లు పరిశీలించారు. మ్యాచ్‌ నిర్వహణకు మైదానం సిద్ధంగా లేదని భావించిన అంపైర్లు మళ్లీ 8 గంటలకు ఇన్‌స్పెక్షన్‌ చేశారు. అప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో 8.45 గంటలకు మరోసారి పరిశీలించారు.

మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే ఆసీస్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో నాగ్‌పుర్‌ వేదికగా జరగబోయే మ్యాచ్‌ భారత్‌కు కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే సిరీస్‌ రేసులో నిలుస్తుంది. ఒకవేళ రెండో టీ20లోనూ టీమ్‌ఇండియా ఓడితే.. వచ్చే ఆదివారం హైదరాబాద్‌ వేదికగా జరగబోయే ఆఖరి మ్యాచ్‌ నామమాత్రంగా మిగులుతుంది. ఇప్పుడు మ్యాచ్‌ సాగేందుకు ఛాన్స్‌ లేకపోతే మాత్రం చివరి టీ20 కీలకంగా మారుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని