IND vs CAN: అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్‌ రద్దు

టీ20 ప్రపంచ కప్‌ 2024లో భాగంగా గ్రూప్‌ ఎలో భారత్, కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ పడకుండానే రద్దయింది.

Updated : 15 Jun 2024 21:33 IST

ఫ్లోరిడా: టీ20 ప్రపంచ కప్‌ 2024లో భాగంగా గ్రూప్‌ ఎలో భారత్, కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ పడకుండానే రద్దయింది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది. అందుకు తగ్గట్టుగానే మ్యాచ్‌ జరిగే బ్రోవార్డ్‌ కౌంటీలో ఇవాళ భారీ వర్షం కురిసింది. దీంతో టాస్‌ వేయడం కూడా సాధ్యం కాలేదు. వర్షం ఆగిపోయినా మైదానం తడిగా ఉండటంతో అంపైర్లు రెండుసార్లు గ్రౌండ్‌ని పరిశీలించారు. అనంతరం మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు తేల్చి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో గ్రూప్‌ దశను టీమ్ఇండియా ఏడు పాయింట్లు (3 విజయాలు, ఒక మ్యాచ్‌ రద్దు)తో ముగించింది.

ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన భారత్.. జూన్‌ 20న తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. జూన్ 22న రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. జూన్ 24న తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సూపర్-8లోని రెండు గ్రూపుల్లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి. జూన్ 26న తొలి సెమీస్‌, 27న రెండో సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 29న బార్బడోస్‌లో ఫైనల్ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని