
INDvs ENG: 78 పరుగులకే ఆలౌటైన టీమ్‌ఇండియా
ఇంటర్నెట్ డెస్క్: : లీడ్స్ వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటైంది.తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన టీమ్‌ఇండియా..రెండో సెషన్‌లో 22 పరుగులు చేసి కూప్పకూలింది. కేఎల్ రాహుల్(0), చతేశ్వర్(1), విరాట్ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చారు.రోహిత్ శర్మ(19) టాప్ స్కోరర్. రహానె(18) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.