IND vs LEIC: ఇండియా, లీసెస్టర్‌ వార్మప్‌ మ్యాచ్‌.. ఆదుకున్న కేఎస్ భరత్‌

టీమ్‌ఇండియా, లీసెస్టర్‌షైర్‌ మధ్య జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.

Published : 23 Jun 2022 23:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా టీమ్‌ఇండియా, లీసెస్టర్‌షైర్‌ మధ్య జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. శ్రీకర్‌ భరత్ (70 నాటౌట్‌; 111 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నాడు. మహ్మద్‌ షమి (18 నాటౌట్‌; 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ (25), శుభమన్ గిల్ (21), విరాట్‌ కోహ్లీ (33) పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. హనుమ విహారి (3), జడేజా (13), శార్దూల్‌ ఠాకూర్‌ (6) విఫలమయ్యారు. ఉమేశ్ యాదవ్‌ (23; 32 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త దూకుడుగా ఆడాడు. లీసెస్టర్ బౌలర్లలో రోమన్‌ వాకర్‌ 5 వికెట్లు పడగొట్టగా.. విల్‌ డావిస్‌ రెండు, అబ్దిని ఒక వికెట్ తీశాడు. ఒక దశలో టీమ్ఇండియా 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా.. విరాట్ కోహ్లీతో కలిసి కేఎస్ భరత్‌ ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాడు. భరత్‌ ఒంటరి పోరాటంతో టీమ్‌ఇండియా 200 పరుగుల మార్క్‌ని దాటింది. రెండో రోజు టెయిండర్లు కేఎస్ భరత్‌కు సహకరిస్తే టీమ్‌ఇండియా 300 పరుగులు చేసే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని