India vs Netherlands: టాస్‌ పడకుండానే భారత్‌- నెదర్లాండ్స్ వార్మప్‌ మ్యాచ్‌ రద్దు

టీమ్ఇండియా, నెదర్లాండ్స్‌ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌కు టాస్ పడకుండానే రద్దయింది.

Published : 03 Oct 2023 17:13 IST

తిరువనంతపురం: ప్రపంచకప్ ముంగిట నిర్వహిస్తున్న వార్మప్‌ మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం అంతరాయం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌లు రద్దవుతున్నాయి. ఇప్పటికే సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్‌.. భారత్‌, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వార్మప్‌ మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. నేడు టీమ్ఇండియా, నెదర్లాండ్స్‌ మధ్య వార్మప్ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్ పడకుండానే ఈ మ్యాచ్‌ రద్దయింది. దీంతో టీమ్‌ఇండియా ఆడాల్సిన రెండు సన్నాహక మ్యాచ్‌లు వర్షార్పణం అయినట్లయింది. ఇవాళ్టితో వార్మప్‌ మ్యాచ్‌లు ముగుస్తాయి. అక్టోబర్‌ 5న (అహ్మదాబాద్‌) ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రధాన మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత్ తన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని