IND vs NZ: రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం.. 2-0తో సిరీస్‌ కైవసం

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 20.1 ఓవర్లలో ఛేదించింది.

Updated : 21 Jan 2023 18:51 IST

రాయ్‌పుర్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 20.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (51; 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదగా.. శుభ్‌మన్ గిల్ (40; 53  బంతుల్లో 6 ఫోర్లు) రాణించాడు. విరాట్ కోహ్లీ (11) నిరాశపర్చాడు. కివీస్ బౌలర్లలో షిప్లే,శాంటర్న్‌ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే మంగళవారం (జనవరి 24న) జరగనుంది.    

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. భారత బౌలర్ల ధాటికి 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (36) టాప్‌ స్కోరర్‌. మైఖేల్ బ్రాస్‌వెల్ (22),  మిచెల్ శాంటర్న్‌ (27) పరుగులు చేశారు. టాప్‌ ఆర్డర్‌లో ఫిన్‌ అలెన్‌ (0), డెవాన్‌ కాన్వే (7), హెన్రీ నికోల్స్‌ (2), డారిల్ మిచెల్ (1), టామ్‌ లేథమ్‌ (1) విఫలమవడంతో కివీస్‌ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గ్లెన్‌ ఫిలిప్స్‌, బ్రాస్‌వెల్, శాంటర్న్‌ కాసేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో కివీస్‌ 100 పరుగుల మార్కుని దాటింది. భారత బౌలర్లలో షమి 3, హార్దిక్ పాండ్య 2, వాషింగ్టన్‌ సుందర్‌ 2, సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు