IND vs NZ: మూడో వన్డేలోనూ భారత్‌దే విజయం.. సిరీస్ క్లీన్‌ స్వీప్‌

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది.

Updated : 24 Jan 2023 21:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని టీమ్‌ఇండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. కివీస్‌ బ్యాటర్లలో డేవాన్‌ కాన్వే (138; 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం బాదగా.. నికోల్స్ (42), మిచెల్ శాంటర్న్‌ (34) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లతో మెరవగా.. చాహల్ రెండు, హార్దిక్ పాండ్య, ఉమ్రాన్ మాలిక్ ఒక్కో వికెట్ తీశారు. శార్దూల్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ బాదిన శుభ్‌మన్‌ గిల్ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ (101; 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్ (112; 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకాలకుతోడు హార్దిక్‌ పాండ్య (54; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (36) ఫర్వాలేదనిపించగా.. ఇషాన్‌ కిషన్‌ (17), సూర్యకుమార్‌ యాదవ్‌ (14), వాషింగ్టన్‌ సుందర్‌ (9) నిరాశపర్చారు. కివీస్ బౌలర్లలో జాకబ్, టిక్నర్‌ చెరో  మూడు‌ వికెట్లు పడగొట్టగా.. మైఖేల్‌ బ్రాస్‌వెల్ ఒక వికెట్ తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని