IND vs NZ: శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరం

కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) దూరమయ్యాడు. జనవరి 18న హైదరాబాద్‌లో తొలి వన్డే జరగనుంది.

Updated : 17 Jan 2023 15:10 IST

ఇంటర్నెట్ డెస్క్: జనవరి 18 నుంచి కివీస్‌తో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌కు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరమయ్యాడు. వెన్నుగాయం కారణంగా అతడు సిరీస్ నుంచి వైదొలిగాడని బీసీసీఐ పేర్కొంది. శ్రేయస్‌ స్థానంలో రజత్‌ పాటిదార్‌ని జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది. చికిత్స కోసం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్ అకాడమీకి వెళ్తాడని వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌, కివీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్ల ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు.

మార్పుల అనంతరం కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎస్ భరత్, హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), రజత్‌ పాటిదార్‌, వాషింగ్టన్‌ సుందర్, షాబాజ్‌ అహ్మద్‌,శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌,మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌,ఉమ్రాన్‌ మాలిక్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని