IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌.. పొంచి ఉన్న వర్షం ముప్పు..?

భారత్‌-కివీస్‌ మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Updated : 18 Nov 2022 10:19 IST

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌, టీమ్‌ఇండియా మధ్యన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ శుక్రవారం జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే.. మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్న భారత జట్టుకు ఈ సిరీస్‌ ఎంతో కీలకం కానుంది. రోహిత్‌ శర్మకు విశ్రాంతినివ్వడంతో జట్టు నాయకత్వ బాధ్యతలు హార్దిక్‌ పాండ్యా చేపట్టాడు. ఉమ్రాన్‌ మాలిక్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్లకు జట్టులో స్థానం దక్కింది.

వెల్లింగ్టన్‌ వాతావరణ పరిస్థతుల ప్రకారం ఈరోజు వర్షం వచ్చే అవకాశాలు దాదాపు 81 శాతం ఉన్నాయి. అయితే, మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి కాస్త తేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ వర్షం ముప్పు 49 శాతం ఉందన్నారు. ఈ కారణంగా ఇరు జట్లు తమ ప్రణాళికలను మార్చుకుంటాయా.. తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని