Sourav Ganguly: పాక్‌తో మ్యాచ్‌లను ఏనాడూ ప్రత్యేకంగా భావించలేదు: గంగూలీ

క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌పై మాజీ స్టార్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మాట్లాడారు.........

Published : 16 Aug 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌పై మాజీ స్టార్‌ క్రికెటర్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మాట్లాడారు. ఆసియా కప్‌ టోర్నీలో దాన్ని కేవలం ఓ మ్యాచ్‌గా మాత్రమే చూస్తానని, ప్రత్యేకం ఏమీ లేదంటూ పేర్కొన్నారు. తాను క్రికెట్‌ ఆడే సమయంలోనూ దాయాది దేశంతో మ్యాచ్‌ను ఏనాడూ ప్రత్యేకంగా చూడలేదని, టోర్నీ విజయం గురించే ఆలోచించేవాడినని అన్నారు.

‘దీన్ని ఆసియా కప్‌లాగే చూస్తాను. కానీ భారత్‌కు, పాక్‌కు మధ్య టోర్నీలా భావించలేను. నేను ఆడేటప్పుడు కూడా పాక్‌తో మ్యాచ్‌ను ఏనాడూ ప్రత్యేకంగా భావించలేదు. మరో మ్యాచ్‌లాగే అనుకుంటూ, టోర్నమెంట్‌లో విజయం సాధించాలనే భావించేవాడిని’ అని గంగూలీ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. రానున్న ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా రాణిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ‘భారత జట్టు ఇప్పుడు పటిష్టంగా ఉంది. ఇటీవల జరిగి మ్యాచ్‌ల్లో గొప్పగా రాణించింది. ఆసియా కప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తుందని భావిస్తున్నా’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని