IND vs SA: 279 పరుగుల లక్ష్య ఛేదన.. నిలకడగా టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌

సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. త్వరగా ఓపెనర్లు ఔట్ కావడంతో శ్రేయస్‌ (24*), ఇషాన్‌ (29*) నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నారు.

Updated : 09 Oct 2022 19:18 IST

రాంచీ: సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 279 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌ (29*), శ్రేయస్‌ అయ్యర్ (24*) ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను వేస్తుండటంతో రిస్క్‌ తీసుకోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 

అంతకుముందు కెప్టెన్‌ శిఖర్ ధావన్‌ (13) మరోసారి విఫలమయ్యాడు. క్రీజ్‌లో కుదురుకోవడానికి సమయం తీసుకొన్న ధావన్‌.. ఆ తర్వాత ధాటిగా ఆడలేకపోయాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (28) ఫర్వాలేదనిపించాడు. భారీ ఇన్నింగ్స్‌గా మలచడంలో సఫలీకృతుడు కాలేకపోయాడు. దీంతో భారత్‌ 48 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకోవాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లు వ్యాన్‌ పార్నెల్, కగిసో రబాడ చెరో వికెట్‌ తీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు