IND vs SA: ఐదో టీ20 మ్యాచ్‌ వర్షార్పణం.. సిరీస్‌ 2-2తో సమం

అనుకున్నట్లే జరిగింది. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్‌ వర్షార్పణమయ్యింది.దీంతో సిరీస్ 2-2తో సమం అయింది. టాస్‌ పడిన కొద్దిసేపటికే ప్రారంభమైన వర్షం మ్యాచ్‌ను ఆలస్యం చేసింది. దీంతో ఆటను 19 ఓవర్లకు కుదించారు.

Updated : 19 Jun 2022 22:22 IST

బెంగళూరు: అనుకున్నట్లే జరిగింది. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్‌ వర్షార్పణమయ్యింది. దీంతో సిరీస్ 2-2తో సమం అయింది. టాస్‌ పడిన కొద్దిసేపటికే ప్రారంభమైన వర్షం మ్యాచ్‌ను ఆలస్యం చేసింది. దీంతో ఆటను 19 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గిన తర్వాత భారత ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగారు. రెండు సిక్సర్లు బాది ఊపు మీద కనిపించిన ఇషాన్‌ (15)ని ఎంగిడి పెవిలియన్‌ చేర్చాడు. మరో ఓపెనర్ రుతురాజ్‌ (10)ని కూడా ఎంగిడియే ఔట్‌ చేశాడు.

3.3 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మళ్లీ వర్షం కురవటం ప్రారంభమైంది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. అప్పటికి భారత్‌ స్కోరు 28/2గా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఇంకా చినుకులు పడుతుండడంతో మ్యాచ్‌ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఐదు టీ20 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలుపొందగా.. తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్‌లో మంచి ఎకానమీతో బౌలింగ్‌ చేసిన భువనేశ్వర్‌ కుమార్‌ ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికయ్యాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని