Updated : 27 Feb 2022 20:57 IST

IND vs SL: శనక ఒంటరి పోరాటం.. టీమ్‌ఇండియా ముందు మోస్తరు లక్ష్యం

ఇంటర్నెట్ డెస్క్: ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో పర్యాటక జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో డాసున్ శనక (74*; 38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో అదరగొట్టాడు. చండిమాల్ (25) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అవేశ్‌ఖాన్‌ 2, హర్షల్‌ పటేల్‌, సిరాజ్, రవిబిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ గుణతిలక (0) గోల్డెన్ డకౌటయ్యాడు. అవేశ్‌ఖాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో నిశాంక (1) వెంకటేశ్ అయ్యర్‌కి చిక్కాడు. ఈ వరుస షాక్‌ల నుంచి తెరుకునేలోపే లంక మరో వికెట్ కోల్పోయింది. అవేశ్‌ఖాన్‌ వేసిన 3.6 బంతికి చరిత్ అసలంక (4) రిషభ్ పంత్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో 4 ఓవర్లకు శ్రీలంక 11/3తో నిలిచి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జనిత్ (9) క్రీజులో నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. రవిబిష్ణోయ్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో జనిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నిలకడగా ఆడుతున్న చండిమాల్‌ హర్షల్ పటేల్ వేసిన 13వ ఓవర్‌లో ఔటయ్యాడు. 

చివర్లో దంచికొట్టిన శనక 

ఆఖరి ఐదు ఓవర్లలో లంక బ్యాటర్లు ధాటిగా ఆడారు. గత మ్యాచ్‌లో మెరిసిన కెప్టెన్‌ డాసున్ శనక మరోసారి దంచికొట్టాడు. సిరాజ్‌ వేసిన 17వ ఓవర్‌లో రెండు, బిష్ణోయ్‌ వేసిన 18వ ఓవర్‌లో రెండు, ఫోర్లు బాదాడు. అవేశ్‌ ఖాన్‌ వేసిన 19వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. చివరి ఓవర్‌లో శనక ఓ ఫోర్‌, సిక్సర్‌ బాదాడు. దీంతో భారత్‌ ముందు లంక మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని