IND vs WI : సిరీస్‌పై కన్నేసిన భారత్‌.. విండీస్‌తో నాలుగో టీ20

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఫ్లోరిడా వేదికగా భారత్‌, విండీస్‌ జట్ల మధ్య నాలుగో మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ నెగ్గిన...

Updated : 06 Aug 2022 21:18 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఫ్లోరిడా వేదికగా భారత్‌, విండీస్‌ జట్ల మధ్య నాలుగో మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ నెగ్గిన విండీస్‌ బౌలింగ్‌ ఎంచుకుని భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. అవుట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో టాస్‌ను దాదాపు 45 నిమిషాలపాటు ఆలస్యంగా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-1తో ముందంజలో నిలిచింది. అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం పెంచే చర్యల్లో భాగంగా విండీస్‌తో ఆఖరి రెండు టీ20లను ఫ్లోరిడాలో నిర్వహించాలని బీసీసీఐ-విండీస్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయించాయి. అయితే నిన్నటి వరకు ఆటగాళ్ల వీసా సమస్య పరిష్కారం కావడంలో జాప్యం జరగడంతో విండీస్‌లోనే నిర్వహించాలని భావించారు. అయితే ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో ఆటగాళ్లకు వీసాలు లభించాయి. దీంతో యథావిధంగా షెడ్యూల్‌ ప్రకారం ఫ్లోరిడాలో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి. గాయం కారణంగా హర్షల్‌ పటేల్‌ ఈ టీ20తోపాటు ఆఖరి మ్యాచ్‌కూ అందుబాటులో ఉండడు. ఈ మేరకు బీసీసీఐ వెల్లడించింది. 

జట్ల వివరాలు: 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్, సంజూ శాంసన్, దీపక్ హుడా, దినేశ్‌ కార్తిక్, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్

విండీస్‌: బ్రాండన్ కింగ్, కేల్ మయేర్స్, నికోలస్‌ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, షిమ్రోన్ హెట్మయేర్, డేవన్ థామస్, జాసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్, అకీల్ హోసీన్, అల్జారీ జోసెఫ్‌, మెకాయ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని