Shreyas iyer: విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మధ్య అదే తేడా: దినేశ్ కార్తీక్
విమర్శలను తిప్పికొట్టేలా శ్రేయస్ అయ్యర్ తన ఆటతీరును మెరుగుపరచుకున్నాడంటూ దినేశ్ కార్తీక్ ప్రశంసించాడు.
దిల్లీ: షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడతాడని టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas iyer)పై విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్(Bangladesh)తో వన్డే సిరీస్(ODI series) చూస్తే ఈ ఆటగాడు ఈ లోపాన్ని అధిగమిస్తున్నట్టే కనిపించాడు. రెండు వారాల వ్యవధిలో రెండు వన్డే మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా ఓడిపోయింది. అయ్యర్ మాత్రం తన స్థిరమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సీనియర్ వికెట్‌కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్(Dinesh karthik) ఈ ఆటగాడిని కొనియాడాడు.
‘‘గణాంకాలు తప్పు చెప్పవు. ఈ ఏడాది వన్డే సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రేయస్ నిలిచాడు. కొంతకాలంగా అతడు అసాధారణమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడనే విషయం దీంతో స్పష్టమవుతోంది. ఒక్క ఈ ఏడాదిలోనే 700పైగా పరుగులు సాధించాడు. దీనిని బట్టి అతడెంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడో తెలుస్తోంది. వన్డే క్రికెట్ శ్రేయస్‌కి సరిగ్గా సరిపోతుంది. తాను కొన్ని బంతులు ఆడి మెల్లిగా వేగాన్ని అందిపుచ్చుకుంటాడనే వాస్తవాన్ని అతడు గ్రహించాడు. స్పిన్నింగ్ పరంగా అద్భుతమైన ఆటగాడు. అందుకే కొందరు అతడిని ముందుగా షార్ట్ బాల్స్‌తో పరీక్షిస్తున్నారు. అయినా, ప్రతి ఆటలోనూ శ్రేయస్ రాణిస్తున్నాడు. మొదట షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో కాస్త సంకోచించేవాడు. ప్రతిసారీ ఆ భయాన్ని అధిగమిస్తూ వస్తున్నాడు. అతడు ఫీల్డ్‌లోకి వస్తుంటే తన పని పూర్తిచేసే వెళ్తాడు అన్నట్టుగా కనిపిస్తున్నాడు. రెండో వన్డేలో అద్భుతంగా ఆడి భారత్‌ను సురక్షిత స్థాయిలో నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ విరాట్ కోహ్లీ వంటి దిగ్గజంతో పోల్చాలనుకొంటే మాత్రం.. శ్రేయస్ నాటౌట్‌గా నిలిచి 120-130 పరుగులు చేసి జట్టును గెలిపించాలి. అదే వీరిద్దరికి మధ్య ఉండే వ్యత్యాసం’’ అంటూ దినేశ్ కార్తీక్ తెలిపాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ ముంగిట శనివారం చట్‌గావ్ వేదికగా చివరి వన్డేను భారత్ ఆడనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Postal jobs: తపాలా శాఖలో 40,889 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?
-
India News
India-China: మరిన్ని ఘర్షణలు జరగొచ్చు : తాజా నివేదికలో ప్రస్తావన
-
India News
Padma Shri: ‘పద్మశ్రీ’ వరించినా.. పక్కా ఇల్లు మాత్రం రాలేదు..!
-
Movies News
Pathaan: 32 ఏళ్ల తర్వాత అక్కడ హౌస్‌ఫుల్ బోర్డు.. ‘పఠాన్’ అరుదైన రికార్డు
-
Politics News
CM KCR: కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్
-
India News
Go First Airways: 55 మందిని వదిలేసిన గో ఫస్ట్ ఎయిర్వేస్కు భారీ జరిమానా