కోహ్లీ కెప్టెన్సీని ప్రశ్నించలేను: గంభీర్
సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ప్రశ్నించలేనని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. టెస్టుల్లో కోహ్లీ గొప్ప నాయకుడని కొనియాడాడు. తండ్రైన ఆనందంలో...
ఇంటర్నెట్‌డెస్క్: సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ప్రశ్నించలేనని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. టెస్టుల్లో కోహ్లీ గొప్ప నాయకుడని కొనియాడాడు. తండ్రైన ఆనందంలో ఇంగ్లాండ్ సిరీస్‌లో ఎంతో ఉత్సాహంతో విరాట్ బరిలోకి దిగుతాడని తెలిపాడు. పితృత్వ సెలవులపై ఆస్ట్రేలియా పర్యటనలో మూడు టెస్టులకు దూరమైన కోహ్లీ స్వదేశంలో జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్‌తో తిరిగి జట్టులో చేరిన సంగతి తెలిసిందే.
‘‘కోహ్లీ టీ20 కెప్టెన్సీపై మాత్రమే నేను ప్రశ్నిస్తాను. కానీ వన్డే ఫార్మాట్, టెస్టుల్లో అతడి నాయకత్వాన్ని సందేహించను. అతడి సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్లో. అతడి కెప్టెన్సీలో భారత జట్టు మరిన్ని గొప్ప విజయాలు కచ్చితంగా సాధిస్తుంది. టీమిండియా ఎప్పుడూ ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడి ఉండదు. ఈ విషయాన్ని కోహ్లీ పదేపదే చెబుతుంటాడు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
‘‘అవును, కోహ్లీ గొప్ప నాయకుడు. ఆస్ట్రేలియా విజయంపై జట్టంతా ఎంత సంతోషించిందో విరాట్ కూడా అలానే ఆనందించి ఉంటాడు. టెస్టు క్రికెట్లో జట్టుకు అతడు ఎంతో కృషి చేశాడు. ఇక వ్యక్తిగత జీవితంలో కోహ్లీ గొప్ప అనుభూతిని పొందాడు. అతడు ఆ సంతోషంతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి జట్టులో చేరాడు. నాయకుడు ఆనందంగా ఉండటం ఎంతో ముఖ్యం. కోహ్లీ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ను ఎంతో ప్రత్యేకంగా తీసుకుంటాడు. ఎందుకంటే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో అర్హత సాధించాలంటే టీమిండియాకు ఇది కీలకం’’ అని గంభీర్ అన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా భారత్ శుక్రవారం తొలి టెస్టు ఆడనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Cheetahs: మళ్లీ ఎగిరొస్తున్న చీతాలు.. ఈసారి ఎక్కడినుంచంటే..?
-
Movies News
Jamuna: ఏడాదిపాటు మాట్లాడుకోని సావిత్రి - జమున
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TTD APP: తితిదే యాప్ అప్డేట్.. శ్రీవారి భక్తుల కోసం ‘టీటీ దేవస్థానమ్స్’
-
India News
India-Pakistan: సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకుందాం.. పాక్‌కు భారత్ నోటీసు
-
Politics News
Taraka Ratna: సినీనటుడు తారకరత్నకు అస్వస్థత