CWG 2022 : భారత ఖాతాలో మరో మెడల్‌.. కాంస్య పతకాన్ని సాధించిన మహిళల హాకీ జట్టు

భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. కామన్వెల్త్‌ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.

Published : 07 Aug 2022 15:43 IST

బర్మింగ్‌హామ్‌ : భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. కామన్వెల్త్‌ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో పెనాల్టీ షూటవుట్‌లో 2-1 తేడాతో భారత మహిళలు విజయం సాధించారు. మ్యాచ్‌ ముగియడానికి కొద్ది సెకన్ల ముందు న్యూజిలాండ్‌ స్కోరును సమం చేసింది. దీంతో ఆట పెనాల్టీ షూటవుట్‌కు దారితీసింది. ఇందులో భారత్‌ అద్భుతమైన ప్రదర్శన చేసింది. పెనాల్టీ షూటవుట్‌లో న్యూజిలాండ్‌ ఒకే గోల్‌ సాధించగా.. టీమ్‌ఇండియా 2 గోల్స్‌తో కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత అమ్మాయిల హాకీ జట్టును రిఫరీ తప్పిదం దెబ్బ తీసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ పెనాల్టీ షూటౌట్లో 0-3 తేడాతో ఓడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని