india vs malaysia: మలేసియాను ఓడించిన భారత అమ్మాయిలు!

మహిళల ఆసియా కప్‌లో భాగంగా సోమవారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Published : 03 Oct 2022 17:28 IST

సిల్‌హట్‌: ఆసియాలోని అత్యుత్తమ జట్ల మధ్య పోరు ఉత్కంఠగా మారింది. మహిళల ఆసియా కప్‌లో భాగంగా సోమవారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి బోణీ కొట్టిన  భారత అమ్మాయిలు వరుసగా రెండోసారి గెలిచి సత్తా చాటారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల తేడాతో 181 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఏర్పడిన అంతరాయంతో డీఎల్‌ఎస్‌(డక్‌ వర్త్‌ లూయిస్‌) పద్ధతి ప్రకారం భారత జట్టు విజేతగా నిలిచింది. అప్పటికే 2 వికెట్లకు 16 పరుగుల చేసిన మలేసియా ఓటమిపాలైంది.  ఈ సందర్భంగా తెలుగమ్మాయి సబ్బినేని మేఘన 53 బంతుల్లో 69 పరుగులు తీసి ఔరా అనిపించింది.  11 ఫోర్లు, 1 సిక్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. తన టీ20 కెరీర్లో మొదటి అర్ధ సెంచరీని నమోదు చేసింది ఈ మ్యాచ్‌తో ఓపెనర్‌ షెఫాలీ వర్మ ఫామ్‌లోకి వచ్చింది. 39 బంతుల్లో 46 పరుగులు చేసి 1 ఫోర్‌, 3 సిక్సర్లు బాదింది. చివరిగా రిచా ఘోష్‌ 19 బంతుల్లో 33 (నాటౌట్‌) 5 ఫోర్లు, 1సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. మలేసియా బౌలర్లు దనియా సూహ్యద, కెప్టెన్‌ దురై సింగం చెరో 2 వికెట్లు సాధించారు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts