indw vs slw: శెభాష్ అమ్మాయిలు.. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం
భారత మహిళా జట్టుపై పొగడ్తల వర్షం కురుస్తోంది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత అమ్మాయిలు విజృంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా జట్టుపై పొగడ్తల వర్షం కురుస్తోంది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత అమ్మాయిలు విజృంభించారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 8.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఏడోసారి భారత జట్టు ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. దీంతో మహిళా జట్టుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత సిగలో మరో కీర్తి కిరీటం వచ్చి చేరిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా క్రికెట్ అభిమానులు తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. 25 బంతుల్లో అర్థ సెంచరీని సాధించిన ఓపెనర్ స్మృతి మందానను కొనియాడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ‘ఎనిమిదిలో మొత్తం ఏడు ట్రోఫీలను గెలిచారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. శెభాష్ అమ్మాయిలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చివరి మ్యాచ్‌లో ఏకపక్షంగా ఆడి అదరగొట్టారని ట్వీట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
father characters: తండ్రులుగా జీవించి.. ప్రేక్షకుల మదిలో నిలిచి!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Ponguleti: విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం
-
Ap-top-news News
ACB Court: లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు