INDw Vs SAw: టాజ్మిన్‌ బ్రిట్స్ హాఫ్‌ సెంచరీ.. టీమ్‌ఇండియా లక్ష్యం 178

భారత మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 

Published : 07 Jul 2024 21:00 IST

చెన్నై: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా రెండో టీ20లో తలపడుతున్నాయి. తొలి టీ20లో ఓడిన హర్మన్‌ప్రీత్‌ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టాజ్మిన్‌ బ్రిట్స్‌ (52; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధ శతకం బాదింది. అన్నేకే బోష్ (40; 32 బంతుల్లో 6 ఫోర్లు) రాణించింది. లారా వోల్వార్డ్‌ (22), మరిజేన్‌ కాప్‌ (20), ట్రయాన్ (12), నాడిన్ డిక్లెర్క్ (14), డెర్క్సెన్ (12*) పరుగులు చేశారు. భారత బౌలర్లలో పుజా వస్త్రాకర్ 2, దీప్తి శర్మ 2, శ్రేయాంకా పాటిల్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని