INDw vs ENGw : క్రికెట్‌లో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా

కామన్వెల్త్‌లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన..

Published : 07 Aug 2022 01:48 IST

సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం

ఇంటర్నెట్ డెస్క్‌: కామన్వెల్త్‌లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 160/6 స్కోరుకే పరిమితం చేసి నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో స్కివెర్ 41, వ్యాట్ 35, జోన్స్ 31, సోఫీ డంక్లే 19, కాప్సీ 13, సోఫీ 7, బౌచిర్‌ 4* పరుగులు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. దీంతో రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో  భారత్ ఫైనల్‌లో తలపడనుంది.

మంధాన దూకుడు

టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు స్మృతీ మంధాన - షఫాలీ వర్మ తొలి వికెట్‌కు 76 పరుగులను జోడించారు. ఈ క్రమంలో మంధాన కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం విశేషం.  అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ స్కోరు బోర్డు వేగం కాస్త ఆగింది. హర్మన్‌ (20), దీప్తి శర్మ (22) ఫర్వాలేదనిపించారు. అయితే జెమీమా రోడ్రిగ్స్‌ (44*) ఆఖరి వరకు ఉండి భారత్‌ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెంప్‌ 2.. బ్రంట్, స్కివెర్ చెరో వికెట్ తీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని