INDW vs BANW: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Updated : 22 Mar 2022 06:39 IST

న్యూజిలాండ్‌: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత్‌కు ఎంతో కీలకం కానుంది. ఐదు మ్యాచ్‌ల్లో భారత్ రెండు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలిస్తేనే మిథాలీసేనకు సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. నిలకడలేని సమస్య భారత్‌ను వెంటాడుతోంది. 

భారతజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, రిచా ఘోష్‌, స్నేహ్‌ రానా, పూజా వస్త్రాకర్, జూలన్ గోస్వామి, రాజేశ్‌ గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని