U19W T20 World Cup: అండర్‌ 19 T20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో  సెమీస్‌లో న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియా గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Updated : 27 Jan 2023 17:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. కీలకమైన సెమీస్‌లో న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.  జార్జియా ప్లిమ్మర్ (35), ఇసాబెల్లా (26) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో ప్రషవి చోప్రా 3 వికెట్లతో మెరవగా.. టిటాస్‌ సాధు, మన్నత్‌ కశ్యప్‌, షెఫాలీ వర్మ, అర్చనా దేవి తలో వికెట్‌ తీశారు. 

108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌.. 14.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్‌ఇండియా బ్యాటర్లలో శ్వేత సెహ్రావత్‍ (61; 45 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధ శతకం బాది భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. సౌమ్య తివారీ (22) ఫర్వాలేదనిపించింది. కివీస్‌ బౌలర్లలో అన్నా బ్రౌనింగ్ రెండు వికెట్లు పడగొట్టింది. మూడు వికెట్లతో ఆకట్టుకున్న భారత బౌలర్‌ ప్రషవి చోప్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌ జనవరి 29న జరుగుతుంది. నేటి సాయంత్రం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య జరిగే రెండో సెమీస్‌లో విజేతగా నిలిచిన జట్టుతో భారత్‌ ఫైనల్‌లో తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని