Indw vs Ausw:రాణించిన దీప్తి శర్మ, రీచా ఘోష్‌.. ఆసీస్‌ లక్ష్యం ఎంతంటే?

మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమైంది. మొదటి టీ20లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

Published : 09 Dec 2022 20:39 IST

ముంబయి: మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమైంది. మొదటి టీ20లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దీప్తి శర్మ (36; 15 బంతుల్లో 8 ఫోర్లు), రీచా ఘోష్‌ (36; 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఓపెనర్‌ షెఫాలీ వర్మ (21; 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడగా..  స్మృతి మంధాన (28; 22 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (0) నిరాశపర్చగా.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (21), దేవికా వైద్య (24) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లీస్ పెర్రీ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, ఆష్లీ గార్డనర్,అన్నాబెల్ సదర్లాండ్ తలో వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని