India vs South Africa: రెండో టీ20 వరుణుడిది

భారత మహిళల జట్టుకు నిరాశ. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. రెండో టీ20లో గెలిచి లెక్క సమం చేయాలని అనుకున్నా వరుణుడు అడ్డుపడ్డాడు.

Published : 08 Jul 2024 03:06 IST

చెన్నై: భారత మహిళల జట్టుకు నిరాశ. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. రెండో టీ20లో గెలిచి లెక్క సమం చేయాలని అనుకున్నా వరుణుడు అడ్డుపడ్డాడు. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మొదట టాస్‌ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు దించిన టీమ్‌ఇండియా.. తొలి టీ20 మాదిరే సఫారీ జట్టు బ్యాటర్లకు కళ్లెం వేయలేకపోయింది. సమష్టిగా రాణించిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. తొలి టీ20లో అర్ధసెంచరీ చేసిన బ్రిట్స్‌ (52; 39 బంతుల్లో 6×4, 1×6) మరోసారి సత్తా చాటింది. అనెక్‌ (40) కూడా రాణించింది. భారత బౌలర్లలో పూజ (2/37), దీప్తిశర్మ (2/20) ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిశాక వర్షం మొదలు కావడంతో ఆ తర్వాత ఆట సాధ్యం కాలేదు. మంగళవారం జరిగే మూడో టీ20లో నెగ్గకపోతే సిరీస్‌ భారత్‌ చేజారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని