INDw Vs SAw: వరుణుడి ఆటంకం.. భారత్‌- దక్షిణాఫ్రికా రెండో టీ20 రద్దు

భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.

Published : 07 Jul 2024 22:22 IST

చెన్నై: భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. తొలి టీ20లో ఓడిన హర్మన్‌ప్రీత్‌ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిచి మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావించింది. కానీ, వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ రద్దయింది. టాస్‌ పడగానే కొద్దిసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. కాసేపటికి వర్షం తగ్గడంతో మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. తర్వాత వరుణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం (జులై 9న) జరిగే మూడో టీ20లో భారత్‌ గెలిస్తే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. టీమ్‌ఇండియా ఓడితే సిరీస్‌ దక్షిణాఫ్రికా వశమవుతుంది. 

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో టాజ్మిన్‌ బ్రిట్స్‌ (52; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధ శతకం బాదింది. అన్నేకే బోష్ (40; 32 బంతుల్లో 6 ఫోర్లు) రాణించింది. లారా వోల్వార్డ్‌ (22), మరిజేన్‌ కాప్‌ (20), ట్రయాన్ (12), నాడిన్ డిక్లెర్క్ (14), డెర్క్సెన్ (12*) పరుగులు చేశారు. భారత బౌలర్లలో పుజా వస్త్రాకర్ 2, దీప్తి శర్మ 2, శ్రేయాంకా పాటిల్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు