WT20 WC: విండీస్‌తో మ్యాచ్‌: టీమ్‌ ఇండియా ముందు స్వల్ప లక్ష్యం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

Updated : 15 Feb 2023 20:32 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్‌ హేలీ మాథ్యూస్ (2) నిరాశపర్చినా.. స్టాఫానీ టేలర్(42; 40 బంతుల్లో 6 ఫోర్లు), షెమైన్ (30; 36 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో మెరవగా.. రేణుక సింగ్, పూజ వస్త్రాకర్‌ తలో వికెట్ పడగొట్టారు. 

ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే పూజ వస్త్రాకర్ మాథ్యూస్‌ని పెవిలియన్‌కు పంపింది. వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షెమైన్‌తో జతకట్టిన స్టాఫానీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. నిలకడగా ఆడుతున్న వీరిద్దరిని 14వ ఓవర్‌లో దీప్తి శర్మ  ఔట్‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రీ (2) రనౌట్‌గా వెనుదిరిగింది. షబికా (15)ను రేణుక సింగ్ క్లీన్‌బౌల్డ్ చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో ఫ్లెచర్ (0) దీప్తి శర్మ ఔట్‌ చేసింది. 

  • ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది. టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌ దీప్తి శర్మనే. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని