Womens cricketer: సూపర్ మార్కెట్‌ సిబ్బందితో మహిళా క్రికెటర్‌ వాగ్వాదం

కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు వెళ్లి అక్కడి సిబ్బందితో క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్‌ వాగ్వాదం చేసిన సంఘటన విజయ్‌పురలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Published : 02 Dec 2022 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ ఓ వివాదంలో చిక్కుకొంది. ఓ సూపర్‌ మార్కెట్‌లో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతోపాటు ఆమెకు సంబంధించిన వ్యక్తులు దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. అయితే సమస్య సామరస్యంగా పరిష్కారమైనట్లు తెలుస్తోంది. ఇది కర్ణాటకలోని విజయపుర ప్రాంతంలో చోటు చేసుకుంది. 

కాస్మొటిక్స్‌ వస్తువుల కోసం రాజేశ్వరి గైక్వాడ్‌  ఓ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బందికి, క్రికెటర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికే క్రికెటర్‌కు చెందిన కొంతమంది మార్కెట్‌ సిబ్బందిపై దాడి చేసేందుకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సీసీ ఫుటేజీని సూపర్‌ మార్కెట్ సిబ్బంది సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ఇరు వర్గాలు కేసు పెట్టేందుకు సమాయత్తమైనప్పటికీ.. సూపర్ మార్కెట్ సిబ్బంది, రాజేశ్వరి గైక్వాడ్ సహాయకులు రాజీ పడి సమస్యను పరిష్కరించుకొన్నారు. అయితే దాడి విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి  కేసు నమోదు కాలేదని విజయపుర పోలీసులు స్పష్టం చేశారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు