INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్‌ భారత్‌ సొంతం

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. బ్యాటర్ల సమష్టికృషికి బౌలర్ల మెరుపుబంతులు తోడవ్వడంతో భారత్‌ సునాయాసంగా విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమ్‌...

Updated : 07 Aug 2022 00:48 IST

ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగులుండగానే భారత్‌ సొంతం చేసుకుంది. బ్యాటర్ల సమష్టికృషికి బౌలర్ల మెరుపుబంతులు తోడవ్వడంతో నాలుగో మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 ఆధిక్యంతో తన ఖాతాలో వేసుకుంది. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో 59 పరుగుల తేడాతో విజయదుందుబి మోగించింది. టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషభ్‌పంత్‌ 44 (31 బంతుల్లో 6×4), రోహిత్‌ శర్మ 33 (16 బంతుల్లో 2×4,3×6), సంజూ శాంసన్‌ 30 నాటౌట్‌ (23 బంతుల్లో 2×4,1×6), సూర్య కుమార్‌ 24 (14 బంతుల్లో 1×4,2×6) దీపక్‌ హుడా 21 (19 బంతుల్లో 2×4), అక్షర్ 20నాటౌట్‌ (8 బంతుల్లో 1×4,2×6) సమష్టిగా రాణించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ను భారత్‌ బౌలర్లు కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ స్కోరుబోర్డును ముందుకు కదలనివ్వలేదు. వెస్టిండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ (24), నికోలస్‌ పూరన్( 24) మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా..అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ తలో రెండు వికెట్లు తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని