ZIM vs IND : జింబాబ్వేతో మూడో వన్డే.. చెమటోడ్చి నెగ్గిన టీమ్‌ఇండియా

జింబాబ్వేను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసేసింది. మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన...

Updated : 22 Aug 2022 23:23 IST

భారత్‌కు చెమటలు పట్టించిన సికిందర్

మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన రాహుల్‌ సేన

ఇంటర్నెట్ డెస్క్‌: జింబాబ్వేను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసేసింది. మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 276 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో జింబాబ్వే విజయం సాధించేలా కనిపించింది. అయితే భారత బౌలర్లు ఆఖర్లో జింబాబ్వే బ్యాటర్లను అడ్డుకోగలిగారు. సికిందర్ రజా (115) శతకం సాధించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. బ్రాడ్ ఇవాన్స్‌ (28)తో కలిసి 104 పరుగులను జోడించాడు. అయితే టీమ్ఇండియా బౌలర్లు స్వల్ప వ్యవధిలో వారిద్దరిని ఔట్‌ చేయడంతో కథ సుఖాంతమైంది. మిగతా బ్యాటర్లలో సీన్‌ విలియమ్స్‌ (45) రాణించగా.. కైతానో 13, కైయా 6, టోనీ 15, రెగిస్ చకబ్వా 16, రైన్ బర్ల్ 8, లూక్ జాగ్వే 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అవేశ్‌ ఖాన్ 3, దీపక్ చాహర్ 2, కుల్‌దీప్‌ 2, అక్షర్ పటేల్ 2, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. 

గిల్‌ సూపర్ సెంచరీ

శుభ్‌మన్‌ గిల్ (130) అద్భుతమైన శతకం సాధించాడు. ఆరంభం నుంచి సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. గిల్‌తోపాటు ఇషాన్‌ కిషన్ (50) రాణించడంతో భారత్‌ భారీ స్కోరు నమోదు చేసింది. భారత బ్యాటర్లలో శిఖర్ ధావన్ 40, కేఎల్ రాహుల్ 30, దీపక్ హుడా 1, సంజూ శాంసన్ 15, అక్షర్‌ పటేల్ 1, శార్దూల్ ఠాకూర్ 9 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5.. నైయుచి, లూక్‌ జాగ్వే చెరో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో సెంచరీతోపాటు, సిరీస్‌లో రాణించిన శుభ్‌మన్‌ గిల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని