World Chess: ప్రపంచ చెస్‌ ఫెడరేషన్‌ (FIDE) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్‌ ఆనంద్‌

చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ను (Viswanathan Anand) కీలక పదవి వరించింది.

Published : 08 Aug 2022 02:24 IST

చెన్నై: చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ను (Viswanathan Anand) కీలక పదవి వరించింది. అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ (FIDE) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్‌ ఆనంద్‌ ఎన్నికయ్యారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా ఇప్పటివరకు ఉన్న ఆర్కడీ దివొర్కొవిచ్‌ తిరిగి రెండోసారి ఎన్నికకాగా.. ఆయన బృందంలోనే విశ్వనాథన్‌ ఆనంద్‌ కూడా ఉండడం విశేషం.

చెన్నైలో జరుగుతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌ (Chess Olympiad) జరుగుతోన్న సమయంలోనే ప్రపంచ చెస్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరిగింది. ప్రపంచ చెస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా దివొర్కొవిచ్‌కు 157 ఓట్లు రాగా, 16 వ్యతిరేకంగా వచ్చాయి. మొత్తం ఓట్లలో ఒకటి చెల్లనిది కాగా, మరో ఐదుగురు గైర్హాజరయ్యారు. వీరిలో ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్‌ ఆనంద్‌ను ఎన్నుకున్నారు.

ఎన్నో టైటిళ్లు గెలుచుకున్న ప్రపంచ చెస్‌ రారాజు విశ్వనాథన్‌ ఆనంద్‌.. ఇటీవల టోర్నమెంట్లకు దూరంగా ఉంటూ, కేవలం కోచింగ్‌పైనే దృష్టి సారించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఆనంద్‌.. ఇప్పటికి ఐదుసార్లు గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న ఒలింపియాడ్‌లో ఆడనప్పటికీ.. భారత బృందాలకు మార్గదర్శకుడిగా సేవలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని