Andrew Symonds: సైమండ్స్‌తో చాలా మంచి జ్ఞాపకాలున్నాయి.. : సచిన్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ శనివారం రాత్రి కారు ప్రమాదంలో మృతిచెందడంపై టీమ్‌ఇండియా దిగ్గజాలు విచారం వ్యక్తం చేశారు...

Published : 16 May 2022 02:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై టీమ్‌ఇండియా దిగ్గజాలు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అతడి సేవలను గుర్తుచేసుకున్నారు. సచిన్ తెందూల్కర్‌ స్పందిస్తూ ఈ వార్త విని షాకయ్యానని తెలిపాడు. ఈ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నాడు. సైమండ్స్‌ భారత టీ20 లీగ్‌లో ముంబయి తరఫున ఆడేటప్పుడు తనకెన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. అలాగే సైమండ్స్‌తో వివాదంలో చిక్కుకున్న హర్భజన్‌ సింగ్‌ సైతం సంతాపం తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని