IPL 2023: వారి జాబితాలో చేరాలంటే.. అతడు మరో ఏడాది ఇలానే ఆడాలి: కపిల్ దేవ్
ఐపీఎల్‌లో (IPL 2023) నిలకడైన ఆటతీరును ప్రదర్శించి గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. తక్కువ వయసులోనే ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిలిచింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ చివరి బంతి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. అయితే, ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేసిన యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్న పిన్న వయస్కుడిగా రికార్డూ సృష్టించాడు. ఈ సీజన్‌లో గిల్ 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. దీంతో గిల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. కానీ, టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం అభినందనలు తెలుపుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ప్రదర్శననే వచ్చే సీజన్‌లోనూ చేస్తేనే టాప్ బ్యాటర్లతో పోలుస్తానని పేర్కొన్నాడు. అయితే, గిల్‌లో ఆ శక్తి సామర్థ్యాలకు కొదవేంలేదని అభిప్రాయపడ్డాడు.
‘‘సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ.. ఇలా ఒక్కొక్కరు తమ బ్యాటింగ్‌లో సత్తా చాటిన ప్లేయర్లు. ఇప్పుడు ఆ జాబితాలోకి శుభ్‌మన్ గిల్ కూడా వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వారి అడుగు జాడల్లోనే గిల్ బ్యాటింగ్ ప్రదర్శన ఉంది. అయితే, వారితో గిల్‌ను పోల్చాలంటే మాత్రం వచ్చే సీజన్‌లోనూ ఇలాగే భారీగా పరుగులు చేయాలి. అప్పుడు గొప్ప బ్యాటర్ల లిస్ట్‌లోకి చేరడం ఖాయం. గిల్‌కు ఆ సత్తా ఉంది. అయితే, ఇంకాస్త పరిణతితో ఆడాలి’’ అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ