Ravi Shastri : రంజీ ట్రోఫీని విస్మరించొద్దు.. అది భారత క్రికెట్‌కు వెన్నెముకలాంటిది : రవిశాస్త్రి

రంజీ ట్రోఫీని విస్మరిస్తే.. భారత క్రికెట్‌కు వెన్నెముక లేకుండా పోతుందని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. దేశవాళీ క్రికెట్ ద్వారానే నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి వస్తారని పేర్కొన్నాడు. అతడు ఈ...

Published : 28 Jan 2022 16:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : రంజీ ట్రోఫీని విస్మరిస్తే.. భారత క్రికెట్‌కు వెన్నెముక లేకుండా పోతుందని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. దేశవాళీ క్రికెట్ ద్వారానే నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి వస్తారని పేర్కొన్నాడు. అతడు ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే.. రెండు దశల్లో రంజీ ట్రోఫీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించడం గమనార్హం. 

‘భారత క్రికెట్‌కు రంజీ ట్రోఫీ వెన్నెముక లాంటిది. దాన్ని విస్మరిస్తే మన క్రికెట్‌ దిక్కులేనిదవుతుంది’ అని రవిశాస్త్రి ట్వీట్‌ చేశారు. శాస్త్రి ట్వీట్ చేసిన కొద్ది సేపటికే బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ‘రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి విడతలో లీగ్‌ దశ మ్యాచ్‌లను పూర్తి చేస్తాం. నాకౌట్ మ్యాచ్‌లను జూన్‌లో నిర్వహిస్తాం’ అని ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఫిబ్రవరి రెండో వారంలో రంజీ ట్రోఫీ మొదటి విడత ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. మార్చి 27 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీని ఒకే దశలో నిర్వహించడం కష్టం. అందుకే రెండు దశల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్న బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. జనవరి 13 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా బీసీసీఐ ట్రోఫీని నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని