Published : 02/12/2021 21:57 IST

Anju Bobby George: అంజూ బాబీ జార్జ్‌కి అరుదైన పురస్కారం

(Photo: Anju Bobby George Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత  అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్‌కి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌.. ఆమెను ‘వుమెన్‌ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డుతో సత్కరించింది. క్రీడారంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. దీంతో ఈ అవార్డు అందుకున్న రెండో మహిళా క్రీడాకారిణిగా అంజూ రికార్డుల్లోకెక్కారు. ఈమెకన్నా ముందు ఇథియోపియాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్‌ డిపార్టు తులు 2019లో ఈ అవార్డును అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డ్‌ అందుకోవడంపై అంజూ ఆనందం వ్యక్తం చేశారు. తన సేవలను గుర్తించినందుకు ప్రపంచ అథ్లెటిక్స్‌ అసోసియేసన్‌కు ధన్యవాదాలు తెలిపారు. క్రీడల ద్వారా మహిళా సాధికారత కోసం పాటుపడటం కన్నా మించిన గౌరవం లేదని ట్వీట్ చేశారు. 

కేరళకు చెందిన అంజూ బాబీ జార్జ్‌ 2003 పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్స్‌, 2005 మొనాకోలో జరిగిన ఐఏఏఎఫ్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఫైనల్స్‌లో బంగారు పతకం సాధించిన ఏకైక క్రీడాకారిణిగా నిలిచారు. ఇవే కాక లాంగ్‌ జంప్‌ విభాగంలో ఎన్నో పతకాలు గెలుచుకున్న అంజూ.. 2016లో యువ క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు అకాడమీని ప్రారంభించారు. ఆమె శిక్షణలో రాటుదేలిన కొందరు క్రీడాకారిణులు అండర్‌-20 విభాగంలో పతకాలు కూడా సాధించారు.



Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని