Asian Games: భారత్ జోరు.. ఈక్వస్ట్రియన్‌లో బంగారు పతకం
ఆసియా గేమ్స్‌లో (Asian Games) భారత్ అథ్లెట్లు పతకాల వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ మరో బంగారు పతకం కైవసం చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్ విభాగంలో భారత్ బంగారు పతకం సాధించింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఈక్వస్ట్రియన్‌లో భారత్ బంగారు పతకం కైవసం చేసుకోవడం గమనార్హం. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్లో గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌లో భారత్‌కి నాలుగో గోల్డ్ మెడల్. మిగిలిన మూడు బంగారు పతకాలు 1982 ఆసియా క్రీడల్లో గెల్చుకోవడం విశేషం. మరోవైపు, సెయిలింగ్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే సెయిలింగ్‌లో నేహా ఠాకూర్ రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సెయిలింగ్‌లోనే మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల విభాగంలో రెండు కాంస్య పతకాలు దక్కాయి. ఎబాద్ అలీ ఆర్ఎస్ - X కేటగిరీలో, విష్ణు శరవణన్ ఐఎల్సీఏ విభాగంలో విష్ణు శరవణన్ కాంస్య పతకాలు సాధించారు.
భారత బాక్సర్ సచిన్ అదరగొట్టేశాడు. దీంతో రెండో రౌండ్లోకి ఎంటరయ్యాడు. 57 కేజీల విభాగంలో ఇండోనేషియాకు చెందిన అస్రి ఉదిన్‌పై 5-0 ఆధిక్యంతో విజయం సాధించాడు. ఇక 92 కేజీల విభాగంలో 16వ రౌండ్లో కర్గిస్థాన్ బాక్సర్ ఒముర్‌బెక్‌తో భారత బాక్సర్ నరేంద్ర తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఈస్పోర్ట్స్‌లో భారత ద్వయం అయాన్ బిస్వాస్, మయాంక్ అగర్వాల్ స్ట్రీట్ ఫైటర్ నాకౌట్ రౌండ్ల నుంచి ఎలిమినేట్ అయ్యారు. టెన్నిస్‌లో సుమిత్ నగల్ మూడో రౌండ్లో తలపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
ప్రపంచకప్ ఫైనల్ (ODI Worldcup 2023 Final)లో కోహ్లీ (Virat Kohli) వికెట్ తీయడం తనకు అద్భుతమైన క్షణమని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (Pat Cummins) అన్నాడు. తన చివరి క్షణాల్లోనూ ఆ వికెట్టే గుర్తొస్తుందన్నాడు. -
Australia: ఆస్ట్రేలియాకు ప్రపంచకప్‌ను అందించిన ఆ ఒక్క మీటింగ్..!
ప్రపంచకప్‌లో తొలుత ఎదురైన ఓటముల నుంచి ఎలా బయటపడ్డామనే రహస్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ బయటపెట్టాడు. కేవలం ఒక్క మీటింగ్ జట్టు ఆటతీరును మార్చేసిందన్నాడు. -
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గట్టి పోటీదారుగా బరిలో దిగుతుందని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. యువ ప్రతిభావంతులకు టీమ్ఇండియా కేంద్రంగా మారిందని అతను అభిప్రాయపడ్డాడు. -
India vs Australia: సిరీస్‌పై భారత్ కన్ను
ప్రపంచకప్ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడుతూ తొలి రెండు టీ20ల్లో అదరగొట్టిన టీమ్ఇండియా.. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకోవాలన్నదే లక్ష్యం. -
Hardik Pandya: వారసుడు ఇతనేనా?
అతడి కోసం గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ఆల్‌రౌండర్‌ను వదులుకుంది. అతడి కోసం రూ.15 కోట్లు చెల్లించింది. -
గుజరాత్ కెప్టెన్‌గా శుభ్‌మన్
గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు. ఈ టీమ్ఇండియా యువ సంచలనం వచ్చే ఏడాది ఐపీఎల్లో టైటాన్స్‌ను నడిపించనున్నాడు. -
రోహిత్ రాయుడు సెంచరీ వృథా
విజయ్ హజారె ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్‌కు తొలి పరాజయం ఎదురైంది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్‌ను ఛత్తీస్‌గఢ్ నిలువరించింది. -
బంగ్లా - కివీస్ తొలి టెస్టు నేటి నుంచే
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు బంగ్లాదేశ్ సై అంటోంది. మంగళవారం నుంచే తొలి టెస్టు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023- 2025 చక్రంలో ఈ రెండు జట్లకిదే తొలి మ్యాచ్. -
ముంబయితో ఎన్నో జ్ఞాపకాలు
ముంబయి ఇండియన్స్ జట్టుతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, తిరిగి జట్టుతో చేరడం బాగుందని హార్దిక్ తెలిపాడు. 2015లో ముంబయితోనే ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన అతను.. -
IPL-2024: ఐపీఎల్లో ఆడాలని ఉంది: పాకిస్థాన్ బౌలర్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఐపీఎల్లో ఆడాలని ఉందని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ (Hasan Ali) తన మనసులోని మాటను బయటపెట్టాడు.


తాజా వార్తలు (Latest News)
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
-
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?
-
Kriti Sanon: అల్లు అర్జున్‌తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
-
కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!
-
Nara Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్
-
అమెరికా అభ్యర్థనకు ఓకే.. కెనడాకు మాత్రం నో: కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు