Indian T20 League: గిన్నిస్‌ రికార్డులో టీ20 ఫైనల్‌ మ్యాచ్‌.. ఎందుకో తెలుసా?

ఈ ఏడాది మే 29న జరిగిన భారత టీ20 లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిర్వహించిన ఈ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు.

Updated : 27 Nov 2022 22:35 IST

దిల్లీ: ఈ ఏడాది మే 29న జరిగిన భారత టీ20 లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. దాదాపు 1,01,566 మంది హాజరయ్యారు. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్ చరిత్రలో ప్రత్యక్షంగా అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ ఘనత సాధించడంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ రికార్డు సాధించడం పట్ల బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా హర్షం వ్యక్తం చేశారు. 

మే 29న జరిగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య సారథ్యంలోని గుజరాత్, సంజూ శాంసన్‌ నాయకత్వంలోని రాజస్థాన్‌ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి తొలి సీజన్‌లోనే టైటిల్‌ని ఎగరేసుకుపోయి సంచలనం సృష్టించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని