CWG 2022: కామన్‌ వెల్త్‌లో మరో చారిత్రక ప్రదర్శన చేసిన భారత్‌

కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ మరో చారిత్రక ప్రదర్శన చేసింది. దీంతో మన జాబితాలో మరో పతకం ఖాయమైంది. ఉమెన్స్‌ ఫోర్స్‌ ఈవెంట్‌ లాన్‌ బౌల్స్‌లో భారత బృందం సోమవారం ఫైనల్‌కు దూసుకెళ్లింది...

Updated : 15 Aug 2022 14:07 IST

(Photo: SAI Media Twitter)

బర్మింగ్‌హామ్‌: కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ మరో చారిత్రక ప్రదర్శన చేసింది. దీంతో మన జాబితాలో మరో పతకం ఖాయమైంది. ఉమెన్స్‌ ఫోర్స్‌ ఈవెంట్‌ లాన్‌ బౌల్స్‌లో భారత బృందం సోమవారం ఫైనల్‌కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో తలపడిన కీలక పోరులో 16-13 తేడాతో గెలిచిన భారత బృందం.. బుధవారం తుదిపోరులో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. లవ్లీ చౌబే నాయకత్వం వహిస్తున్న ఈ బృందంలో పింకి, నయన్‌మోనీ సాయికియా, రూపారాణి అనే ముగ్గురు అథ్లెట్లు భాగమయ్యారు. వీరు తుదిపోరులోనూ ఇలాగే గెలిస్తే భారత్‌కు కామన్వెల్త్‌ పోటీల్లో మరో స్వర్ణ పతకం ఖాయమవ్వనుంది. ఒకవేళ ఓడినా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ పోటీలో ఏ పతకం సాధించినా అది భారత్‌కు గొప్ప విశేషం కానుంది. ఎందుకంటే ఈ ఈవెంట్‌లో భారత్‌ తొలిసారి ఒక పతకం సాధించనుంది. కాగా, ఇదే జట్టు ఆదివారం నార్‌ఫోల్క్‌ ఐలాండ్‌ను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు సెమీస్‌లోనూ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని