Archery WorldCup: భారత్‌కు మూడు స్వర్ణాలు

ఆర్చరీ ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో ఆదివారం భారత అగ్రశ్రేణి ఆర్చర్లు రెచ్చిపోయారు. దాంతో వరుసగా రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించారు. తొలుత రికర్వ్‌ టీమ్‌కు చెందిన దీపిక కుమారి, అంకిత భకత్‌, కోమాలిక...

Updated : 27 Jun 2021 19:24 IST

పారిస్‌: ఆర్చరీ ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో ఆదివారం భారత అగ్రశ్రేణి ఆర్చర్లు రెచ్చిపోయారు. దాంతో వరుసగా రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించారు. తొలుత  దీపిక కుమారి, అంకిత భకత్‌, కోమాలిక.. మెక్సికన్‌ టీమ్‌కు చెందిన ఐదా రోమన్‌, అలెజాండ్ర వాలెన్‌సియా, అనా వాజేకుజ్‌ను 5-1 తేడాతో ఓడించారు. కాగా, ఈ ఏడాది ప్రపంచకప్‌లో వీరికిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. రెండు నెలల కిందట గ్వాటిమాలలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఈ భారత అమ్మాయిలు అదే మెక్సికన్‌ టీమ్‌ను ఓడించడం గమనార్హం.

మరోవైపు మిక్స్‌డ్‌ టీమ్‌లోనూ భారత స్టార్‌ జోడీ అతను దాస్‌, దీపిక కుమారి స్వర్ణం గెలిచారు. నెదర్‌లాండ్స్‌కు చెందిన జెఫ్‌ వాన్‌ డెన్‌ బర్గ్‌, గాబ్రిలా స్కాలెసర్‌ను 5-3 తేడాతో ఓడించి విజేతగా నిలిచారు. ఇక శనివారం జరిగిన పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో అగ్రశ్రేణి ఆర్చర్‌ అభిషేక్‌ వర్మ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన క్రిస్‌షాఫ్‌ను షూటాఫ్‌లో ఓడించి విజేతగా నిలిచాడు. దాంతో ఈ ప్రపంచకప్‌లో భారత్‌ మొత్తం మూడు విభాగాల్లో స్వర్ణాలు సాధించడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని