VVS Laxman : ఈ గెలుపు కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం నింపింది: వీవీఎస్‌ లక్ష్మణ్‌

టీమ్‌ఇండియా కుర్రాళ్లు అండర్‌-19 ఆసియా కప్‌ సాధించడంపై మాజీ క్రికెటర్‌, నేషనల్‌ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌ కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసలు కురిపించాడు. ఈ విజయం కుర్రాళ్లలో ఆత్మ..

Published : 01 Jan 2022 21:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా కుర్రాళ్లు అండర్‌-19 ఆసియా కప్‌ సాధించడంపై మాజీ క్రికెటర్‌, నేషనల్‌ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌ కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసలు కురిపించాడు. ఈ విజయం కుర్రాళ్లలో ఆత్మ విశ్వాసం నింపిందని అన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న అండర్‌-19 ప్రపంచకప్‌నకు ఈ గెలుపు ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నాడు.  

‘అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన కుర్రాళ్లకు అభినందనలు. కరోనా కారణంగా సరైన సన్నద్ధత లేకపోయినా.. ఎంతో మెరుగ్గా రాణించారు. ఇదే స్ఫూర్తితో అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ సత్తా చాటాలి’ అని లక్ష్మణ్‌ ట్వీట్ చేశాడు. శ్రీలంకతో నిన్న (డిసెంబరు 31న) జరిగిన ఫైనల్‌ పోరులో టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, జనవరి 14 - ఫిబ్రవరి 5 వరకు ఐసీసీ అండర్‌ - 19 ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌నకు వెస్టిండీస్‌ ఆతిథ్యమివ్వనుంది.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని