
Hardik Pandya: హార్దిక్ అన్నింటా అదరగొడితే..
టీమ్‌ఇండియా ప్రపంచకప్ అవకాశాలు మెరుగవుతాయి: సాబా కరీమ్
ఇంటర్నెట్ డెస్క్: యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్‌గా ఉంటే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అవకాశాలు రెట్టింపు అవుతాయని మాజీ క్రికెటర్ సాబా కరీమ్ అన్నారు. అతడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేస్తే జట్టు సమతూకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. శ్రీలంక పర్యటన అతడికి సవాలేనని వెల్లడించారు.
‘ఒక బ్యాట్స్‌మన్‌గా శ్రీలంక పర్యటన హార్దిక్ పాండ్యకు సవాలే. ఎందుకంటే ఐపీఎల్ సమయంలో చెన్నై పిచ్‌లపై అతడు ఇబ్బంది పడ్డాడు. శ్రీలంకలోనూ అతడికి అలాంటి స్లో వికెట్లే ఎదురవుతాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో సవాళ్లు విసిరే పిచ్‌లపై అతడు మంచి స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయగలడేమో చూడాలి’ అని కరీమ్ అన్నారు.
‘నిజానికి హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకుంటే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అవకాశాలు రెట్టింపు అవుతాయి. అతడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేస్తే ఇంకా మెరుగవుతాయి. ఇంగ్లాండ్, శ్రీలంకలో భారత జట్లు పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్ వరకు అతడిపై పనిభారం ఎలా పర్యవేక్షిస్తారో చూడాలి. అతడు ఫిట్‌నెస్ సంతరించుకొనేలా పర్యవేక్షణ ఉండాలి’ అని కరీమ్ అన్నారు.
వెన్నెముక శస్త్ర చికిత్స తర్వాత హార్దిక్ పాండ్య కోలుకొనేందుకు దాదాపుగా ఏడాది కాలం పట్టింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసినా ఎక్కువ పనిభారం మోపలేదు. ఫిట్‌నెస్ సమస్యలు ఉండటంతో బౌలింగ్ ఇవ్వలేదు. కేవలం బ్యాట్స్‌మన్‌గానే కొనసాగాడు. ఆసీస్‌లో నాలుగైదు ఓవర్లు మాత్రమే కోహ్లీ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు పూర్తి దృఢంగా తయారై బౌలింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.