అది టీమిండియా అర్థరహిత నిర్ణయం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం టీమిండియా తీసుకున్న అర్ధరహిత నిర్ణయమని మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ అన్నాడు. ‘‘టీమిండియా తీసుకున్న అర్ధరహిత.........

Updated : 06 Feb 2021 17:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం టీమిండియా తీసుకున్న అర్థరహిత నిర్ణయమని మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ అన్నాడు. ‘‘టీమిండియా తీసుకున్న అర్థరహిత నిర్ణయమిది. గాయాలతో ఆటగాళ్లు దూరమైనా, స్వదేశంలో టెస్టులు జరుగుతున్నా.. కుల్‌దీప్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఇక అతడు ఎలాంటి సందర్భాల్లో జట్టులో ఉంటాడు?’’ అని వాన్ ట్వీట్ చేశాడు.

గాయంతో జడేజా జట్టుకు దూరమవ్వడంతో కుల్‌దీప్‌ జట్టులో ఉంటాడని భావించానని మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా అన్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కుల్‌దీప్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు యువ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్‌, షాబాజ్ నదీమ్‌ జట్టులో చోటు సంపాదించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలోనూ కుల్‌దీప్‌కు నిరాశే మిగిలింది. నాలుగు టెస్టుల్లోనూ అతడికి అవకాశం రాలేదు. 2019 జనవరిలో సిడ్నీ వేదికగా కుల్‌దీప్‌ ఆఖరి టెస్టు ఆడాడు.

ఇవీ చదవండి

క్రీడా స్ఫూర్తికి సలామ్‌: రూట్‌కు కోహ్లీ సాయం

చెపాక్‌లో ‘రూట్‌’ వేశాడు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని