INDW vs NZW: న్యూజిలాండ్‌ బౌలర్ల జోరు.. శ్రమిస్తోన్న టీమ్‌ఇండియా బ్యాటర్లు

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడానికి తీవ్రంగా కష్టపడుతోంది...

Published : 10 Mar 2022 12:10 IST

(Photo: BCCI Womens Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. 261 పరుగుల ఛేదనకు దిగిన భారత్‌ 25 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 75 పరుగులే చేసింది. దీంతో మిగిలిన సగం ఓవర్లలో 186 పరుగుల భారీ స్కోర్‌ చేయాల్సి ఉంది. న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో భారత బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. టాప్‌ఆర్డర్‌లో స్మృతి మంధాన (6), దీప్తి శర్మ (5) విఫలమయ్యారు. 26 పరుగులకే వీరిద్దరూ పెవిలియన్‌ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. అనంతరం మిథాలీరాజ్‌ (23*)తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేసిన ఓపెనర్‌ యాస్తికా భాటియా (28; 59 బంతుల్లో 2x4) కాసేపు వికెట్‌ కాపాడుకున్నా పెద్ద స్కోర్‌ సాధించలేకపోయింది. జట్టు స్కోర్‌ 50 పరుగుల వద్ద ఉండగా యాస్తికా మూడో వికెట్‌ రూపంలో వెనుదిరిగింది. ప్రస్తుతం మిథాలీ, హర్మన్‌ ప్రీత్‌ (9) క్రీజులో ఉన్నారు. వీరిద్దరి బ్యాటింగ్‌పైనే జట్టు విజయావకాశాలు ఆధారపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని