INDW vs PAKW: టీమ్‌ఇండియాకు షాక్‌.. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు

మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు భారీ షాక్‌ తగిలింది. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది...

Updated : 06 Mar 2022 08:36 IST

బే ఓవల్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు భారీ షాక్‌ తగిలింది. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి మిథాలిసేన కష్టాల్లో పడింది. జట్టు స్కోర్‌ 96 పరుగుల వద్ద దీప్తి శర్మ (40; 57 బంతుల్లో 2x4, 1x6) రెండో వికెట్‌గా వెనుదిరగ్గా మరో రెండు పరుగులకే ఓపెనర్‌ స్మృతి మంధాన (52; 75 బంతుల్లో 3x4,1x6) మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టింది. కాసేపటికే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (5), రీచా ఘోష్‌(1) సైతం వెనుదిరిగారు.  దీంతో భారత్‌ 16 పరుగుల స్వల్ప వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 31 ఓవర్లకు 112/5 స్కోర్‌తో నిలిచింది. క్రీజులో కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (8), స్నేహరాణా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని