INDW vs WIW: విండీస్‌తో పోరు.. నిలకడగా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడుతోంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌...

Updated : 12 Mar 2022 08:19 IST

 (Photo: BCCI Womens Twitter)

హామిల్టన్‌: ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడుతోంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 25 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (44; 61 బంతుల్లో 4x4), మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (26; 36 బంతుల్లో 2x4) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ 47 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఓపెనర్‌ యాస్తిక భాటియా (31), వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ మిథాలి రాజ్‌ (5), దీప్తి శర్మ (15) విఫలమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని