WPL 2023: టోర్నీ నుంచి మూనీ ఔట్‌.. గుజరాత్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా స్నేహ్‌ రాణా

గుజరాత్‌ జెయింట్స్‌ (GG) సారథి బెన్‌ మూనీ గాయ పడింది. దీంతో ఆమె స్థానంలో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు టీమ్‌ఇండియా స్టార్‌ స్నేహ్‌ రాణాకు కెప్టెన్సీ బాధ్యతలను మేనేజ్‌మెంట్‌ అప్పగించింది.

Updated : 09 Mar 2023 15:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ప్రీమియర్ లీగ్‌ (WPL 2023)లో తమ మూడో మ్యాచ్‌లో విజయంతో పరుగుల ఖాతా తెరిచిన గుజరాత్ జెయింట్స్‌కు (Gujarat Gaints) ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్‌ సారథి బెత్ మూనీ గాయం కారణంగా టోర్నీకి దూరం కానుంది. దీంతో ఆమె స్థానంలో టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్ స్నేహ్‌ రాణాకు (Sneh Rana) సారథ్య బాధ్యతలను గుజరాత్‌ జెయింట్స్‌ (GG) మేనేజ్‌మెంట్ అప్పగించింది. బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ బెత్‌ మూనీ ఆడలేదు. ఆ మ్యాచ్‌కూ రాణానే కెప్టెన్‌గా వ్యవహరించింది. 

ముంబయి ఇండియన్స్‌తో (GGw VS MIw) జరిగిన తొలి మ్యాచ్‌లోనే మడమ కండరాలు పట్టేయడంతో బెత్‌ మూనీ ఇబ్బంది పడింది. వైద్య పరీక్షల అనంతరం ఆమె కనీసం ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోనుంది. ఈ క్రమంలో మూనీ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసింది. ‘‘తొలి డబ్ల్యూపీఎల్‌లో ఆడేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశా. అదానీ గుజరాత్‌ జెయింట్స్‌తో ఆ కల తీరింది. అయితే, దురదృష్టవశాత్తూ గాయపడ్డా. క్రీడాకారుల జీవితంలో  గాయాలు సర్వసాధారణం. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లను మిస్‌ అవుతున్నా. అయితే తప్పకుండా మరింత శక్తివంతంగా తిరిగి వస్తా’’ అని మూనీ తెలిపింది. ఆమె స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాటర్ లారా వాల్వార్డ్‌ట్‌కు అవకాశం లభించింది. గుజరాత్‌ జెయింట్స్‌కు స్నేహ్ రాణా కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతుండగా.. వైస్ కెప్టెన్‌ ఆష్లే గార్డెనర్‌ను మేనేజ్‌మెంట్‌ నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని