Rohit Sharma: రెండో టెస్టుకు రోహిత్‌ శర్మ దూరమే..?

బొటన వేలి గాయంతో జట్టుకు దూరమైన రోహిత్ శర్మ.. బంగ్లాతో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు కన్పించట్లేదు. అతడు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.

Published : 20 Dec 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌ (Bangladesh)తో రెండో టెస్టుకు రోహిత్‌ శర్మ (Rohit Sharma) అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై సందిగ్ధత ఇంకా వీడట్లేదు. ఈ మ్యాచ్‌కు కూడా హిట్‌మ్యాన్‌ దూరమయ్యే పరిస్థితులే కన్పిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న రోహిత్‌.. రెండో టెస్టుకు ఢాకా వెళ్లే అవకాశాలు లేవని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. రోహిత్‌ అందుబాటులో లేకపోవడంతో రెండో టెస్టు (Second Test)కు కూడా కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) సారథ్య బాధ్యతలు కొనసాగించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా రోహిత్‌ బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం అతడు భారత్‌కు రావడంతో బంగ్లాతో మూడో వన్డే, తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టుకు ఎంపిక చేశారు. డిసెంబరు 22న బంగ్లాతో రెండో టెస్టు ప్రారంభం కానుంది.

ఇక, ఆదివారం ముగిసిన తొలి టెస్టులో (IND VS BAN) టీమిండియా (Team India) అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్యాటు, బంతితో విజృంభించిన భారత్‌.. మొదటి టెస్టులో 188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. దీంతో టెస్టు సిరీస్‌లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో ఉంది. అక్షర్‌ పటేల్‌ (4/77), కుల్‌దీప్‌ యాదవ్‌ (3/73) బంతితో రాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని