Published : 14 Jan 2021 01:29 IST

వావ్‌ కుల్‌దీప్‌... షాక్‌ అయిన గిల్‌

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటన అంతిమ ఘట్టానికి చేరుకుంది. బ్రిస్బేన్‌ వేదికగా శుక్రవారం నుంచి టీమిండియా ఆఖరి టెస్టు ఆడనుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు సాధన‌లో చెమటోడ్చారు. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ విజయవంతంగా ముగించారు. అయితే కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో తుదిజట్టుపై ఆసక్తి పెరిగింది. కాగా, సాధనలో కుల్‌దీప్‌యాదవ్ బంతిని గింగరాలు తిప్పుతుండటంతో జడేజా స్థానంలో అతడు స్థానం దక్కించుకుంటాడనిపిస్తోంది.

నెట్స్‌లో సాధన చేస్తున్న గిల్‌కు కుల్‌దీప్ బౌలింగ్ చేశాడు. స్పిన్‌, వేగంతో దూసుకొచ్చిన బంతుల్ని ఎదుర్కోవడానికి గిల్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆఫ్ స్టంప్‌కు అవతల వేసిన ఓ బంతి గింగరాలు తిరుగుతూ గిల్‌ ప్యాడ్‌కు తగలింది. బ్యాట్స్‌మన్‌కు సమాధానం దొరకని ఆ బంతిని చూసి గిల్‌ ఆశ్చర్యంగా చూశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ‘కుల్‌దీప్‌ వేసిన బంతి ఎలా ఉంది? అది ఔట్‌ అంటారా?’ అని దానికి వ్యాఖ్య జత చేసింది.

గాయంతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా సాధనలో పాల్గొనప్పటికీ బౌలింగ్ కోచ్‌ అరుణ్‌తో కలిసి పేసర్లకు మార్గనిర్దేశం చేశాడు. కోచ్‌తో కలిసి కంగారూలకు కళ్లెం వేయడానికి ప్రణాళికలు రచించడంలో సాయం చేస్తున్నాడు. మరోవైపు రోహిత్‌ శర్మ యువ ఆటగాళ్లకు స్ఫూర్తిని నింపుతున్నాడు. కీలక ఆటగాళ్లు దూరమైనా సమష్టిగా పోరాడి విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే బుమ్రా గైర్హాజరీతో శార్దూల్ ఠాకూర్‌, నటరాజన్‌లో ఒకరు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే సిరాజ్‌, సైనితో పాటు శార్దూల్, నట్టూ ఇద్దరికీ అవకాశం వస్తుంది.

దీ చదవండి

స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు

ఐపీఎల్‌ వల్లే ఆటగాళ్లకు గాయాలు


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts