IND vs ENG:భారత్‌ తీసుకున్న నిర్ణయం సరైందే: ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ 

భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను త్వరలోనే తిరిగి నిర్వహించేందుకు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చలు బీసీసీఐ జరుపుతున్నామని వెల్లడించింది.

Published : 11 Sep 2021 18:00 IST

(Photo:BCCI Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను త్వరలోనే తిరిగి నిర్వహించేందుకు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చలు బీసీసీఐ జరుపుతున్నామని వెల్లడించింది. అయితే, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ని  రద్దు చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయానికి  పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ మద్దతు పలికాడు. ప్రధాన కోచ్‌, ఇతర సహాయక సిబ్బంది  లేకున్నా.. నాలుగో టెస్టులో భారత్‌ అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. 

‘భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు  జరగకపోవడం దురదృష్టకరం. అయితే, ఈ టెస్టు ఆడకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం సరైందే. ఎందుకంటే ఆటగాళ్లలందరూ ఫిజియోతో చాలా సన్నిహితంగా ఉంటారు.అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సాధారణంగా లక్షణాలు మూడు, నాలుగు రోజుల్లో కన్పిస్తాయి. ఇలాంటి సమయంలో మ్యాచ్‌ ఆడితే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కూడా చాలా ప్రమాదంలో పడతారు. కాబట్టి మ్యాచ్‌పై భారత్ తీసుకున్న నిర్ణయం సరైందే’ అని ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని