
IPL 2021: రాణించిన సంజూ.. హైదరాబాద్ లక్ష్యం 165
దుబాయ్: ఆరంభంలోనే వికెట్.. ఆ తర్వాత దూకుడు.. చివర్లో తడబాటు.. ఇదీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ తీరు. కెప్టెన్ సంజూ శాంసన్ (82) అద్భుత అర్ధశతకం సాధించడంతో ఎస్ఆర్హెచ్కు 165 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (6) విఫలం కాగా.. అనంతరం వచ్చిన సంజూ శాంసన్ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (38)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే జైశ్వాల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్‌స్టోన్ (4) ఎక్కువసేపు నిలబడలేదు. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసిన రాజస్థాన్‌ను మహిపాల్ లామరర్ (29)తో కలిసి శాంసన్ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో సంజూతోపాటు పరాగ్ పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్ 164 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2.. సందీప్ శర్మ, భువనేశ్వర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.